Work Culture: దేశంలో కొత్త ట్రెండ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న నిరాసక్తత

Work Culture: తాజాగా వెలుగులోకి వచ్చిన అధ్యయనాలు దేశవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో పెరుగుతున్న ఒక ఆందోళనకర పరిస్థితిని బయటపెట్టాయి. కార్యాలయాలకు క్రమంగా హాజరవుతున్నప్పటికీ, మానసికంగా పనిపై దృష్టి కోల్పోయి, బాధ్యతల పట్ల నిరాసక్తంగా వ్యవహరించే ధోరణి ఎక్కువవుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ పరిస్థితి భారతదేశంలో మరింత తీవ్రంగా ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగులు తమ వృత్తి పట్ల ఆసక్తి కోల్పోయి, కేవలం అప్పగించిన పనిని మాత్రమే యాంత్రికంగా పూర్తి చేసే పరిస్థితి నెలకొంది. సంస్థల అభివృద్ధి, తమ వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలపై దృష్టి తగ్గిపోవడం ఈ పరిస్థితికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ఉద్యోగుల్లో ఈ మార్పుకు ప్రధాన కారణంగా పెరుగుతున్న పనిభారం,...