Post Office: ఈ అదిరిపోయే స్కీమ్ గురించి తెలుసా?.. రూ.300 ఆదా చేస్తే చేతికి రూ.15 లక్షలు
Post Office: సాధారణంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ముందుగా గుర్తుకొచ్చేది భద్రతే. మార్కెట్లో వచ్చే ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా తమ డబ్బు సురక్షితంగా ఉండాలని, పెట్టిన మొత్తం నష్టపోకూడదని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఒక విశ్వసనీయమైన మార్గంగా నిలుస్తోంది. ప్రతిరోజూ చిన్న మొత్తాన్ని పక్కన పెడుతూ, దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కేవలం రూ.300 ఆదా చేయగలిగితే, పదేళ్ల కాలంలో అది లక్షల్లోకి ఎలా మారుతుందో ఈ పథకం ద్వారా స్పష్టమవుతోంది. చిన్నచిన్న పొదుపులు కూడా క్రమశిక్షణతో కొనసాగితే భారీ ఫలితాలను ఇస్తాయని ఈ విధానం నిరూపిస్తోంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్...