Telangana: ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా డీఏ పెంపు!
Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కరువు భత్యం పెంపుపై స్పష్టత ఇస్తూ 2.1 శాతం పెంపును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుండి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. గత 3 నెలలకు సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం విడతల వారీగా చెల్లించనుంది. ప్రతి నెలకు సంబంధించిన బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించే విధానాన్ని అమలు చేయనుంది. అయితే ఈ పెంపుతో ఆర్టీసీ సంస్థపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. ఇదివరకు 2025 జూలైలో ప్రభుత్వం 2.1 శాతం డీఏ పెంచగా,...