Uppal Balu: ఉప్పల్ బాలు జీవిత ప్రయాణం ఇదే..!
Uppal Balu: ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్ సంచలనం సృష్టించిన రోజుల్ని ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ వేదికపై యువత విభిన్నమైన వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున ఆదరణ పొందారు. అయితే టిక్ టాక్ నిషేధం తర్వాత ఆ క్రియేటర్లంతా కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఇన్ స్టా గ్రామ్ వంటి వేదికలపైకి మారిపోయారు. ఇదే సమయంలో టిక్ టాక్ ద్వారా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఉప్పల్ బాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. తన సహజమైన హాస్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బాలు, తనదైన శైలిలో వీడియోలు రూపొందిస్తూ పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించాడు. అతని వీడియోలు ఫోన్ లో...