Warangal: ర్యాగింగ్ కలకలం.. కేఎంసీలో ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

Warangal: వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు స్పష్టమైన ఆధారాలతో రుజువు కావడంతో యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఏడుగురు విద్యార్థులను 6 నెలల పాటు తరగతుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, కోర్సు పూర్తయ్యేంత వరకు హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారగా, ర్యాగింగ్‌పై కళాశాల యాజమాన్యం తీసుకున్న కఠిన వైఖరి స్పష్టంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ...