Arvari: భారతదేశంలోనే అత్యంత చిన్న నది?.. ఈ రివర్ స్టైలే వేరు!
Arvari: భారతదేశంలో అతి చిన్న నదిగా గుర్తింపు పొందిన అర్వారీ నది రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ప్రవహిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. కేవలం 45 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ నది, అల్వార్ ప్రాంతంలోని కొండలలో పుట్టి అదే జిల్లాలో ప్రవహించడం విశేషం. ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయి అదృశ్యమైపోయిన ఈ నది.. మళ్లీ జీవం పొందిన కథ ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచింది. ప్రకృతి పరిరక్షణలో మానవ ప్రయత్నం ఎంతటి మార్పును తీసుకురాగలదో ఈ నది స్పష్టంగా చూపించింది. 1985లో రాజస్థాన్లో తీవ్ర కరువు ఏర్పడిన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా నీటి కొరతతో ఇబ్బందులు పడింది. ఆ సమయంలో నీటి సంరక్షణపై దృష్టి పెట్టిన రాజేంద్ర...