Health Tips: మీకు థైరాయిడ్ ఉందా?.. అయితే వీటికి దూరంగా ఉండండి!

Health Tips: మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడ భాగంలో ఉన్న చిన్న గ్రంథి అయిన థైరాయిడ్ శరీర జీవక్రియను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు లోపించినప్పుడు బరువు ఆకస్మికంగా పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలిపోవడం, అలసట, మానసిక అస్థిరత వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడంతో దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. అయితే సరైన ఆహార అలవాట్లు, నియంత్రిత జీవనశైలి పాటిస్తే ఈ సమస్యను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలతో...