Finance: PF వడ్డీ రేట్లు ఎప్పుడు ఎలా ఉన్నాయంటే?
Finance: ఉద్యోగుల భవిష్యనిధి వడ్డీ రేట్లపై మరోసారి స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు ప్రతిపాదన చేసి, వరుసగా 4వసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం గమనార్హం. వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆశలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి మార్పులు లేకపోవడంతో పీఎఫ్ ఖాతాదారుల్లో నిరాశ నెలకొంది. ప్రతి ఏడాది మార్చి లోపు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భాగంగా ఈపీఎఫ్వో ముందుగా నిర్ణయం తీసుకుని కేంద్ర ఆర్థికశాఖకు పంపుతుంది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేస్తుంది....