Chanakya Niti: ఒంటరిగా ఉన్నారా?.. అయితే ఈ పనులు చేయండి.. మీకు తిరుగుండదు!
Chanakya Niti: ప్రాచీన భారత జ్ఞాన సంప్రదాయంలో ప్రముఖ స్థానం పొందిన ఆచార్య చాణక్యుడు మనిషి జీవన విధానం ఎలా ఉండాలి అనే విషయంలో అనేక విలువైన సూచనలు ఇచ్చిన మహామేధావి. వ్యక్తిగత జీవితం నుండి సామాజిక జీవితం వరకు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించి, మనిషి ఎలా ఎదగాలి, ఎలాంటి అలవాట్లు అలవరుచుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను స్పష్టంగా వివరించాడు. జీవితం సాఫీగా సాగాలంటే కేవలం శ్రమ మాత్రమే కాదు, సరైన ఆలోచనా విధానం, నియంత్రణ, గోప్యత కూడా ఎంతో అవసరమని ఆయన బోధించాడు. మనిషి జీవితంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఉందని చాణక్యుడు స్పష్టం చేశాడు. ముఖ్యంగా చదువు...