అతిగా ఆలోచించడం వల్ల ఏయే వ్యాధులు వస్తాయో తెలుసా?
చిన్న విషయాల గురించే పదే పదే ఆలోచిస్తూ మానసికంగా అలసిపోవడం ఈ రోజుల్లో చాలామందిలో కనిపిస్తున్న ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీన్ని చిన్న విషయం అని తీసుకోవడం మాత్రం పెద్ద తప్పు అవుతుంది. ఒకసారి ఈ అలవాటు మొదలైతే మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా భావిస్తూ, ఆలోచనలలోనే మునిగిపోతూ ఉంటారు. ఈ విధంగా నిరంతరం మధనపడటం వల్ల ఒత్తిడి పెరిగి, నిద్రపై ప్రభావం పడుతుంది. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల శరీరం కూడా అలసటకు గురవుతుంది. క్రమంగా ఈ అలవాటు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, వ్యక్తిని ఎప్పుడూ ఆందోళనలో ఉంచే స్థితికి తీసుకెళ్తుంది. ఒకే విషయం గురించి...