New Trend: కూతురికి విడాకులు మంజూరు.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన పుట్టింటి వారు

New Trend: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన సమాజంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెళ్లి జీవితం ముగిసినప్పుడు దాన్ని కుటుంబాలు బాధగా, అవమానంగా భావించే పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఘటనలో మాత్రం పూర్తి భిన్న దృశ్యం కనిపించింది. తమ కూతురికి విడాకులు మంజూరు కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంగా స్వాగతం పలికి వేడుకలు నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డప్పులు మోగిస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ, ‘ఐ లవ్ మై డాటర్’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి తమ కూతురిని పుట్టింటికి ఆహ్వానించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ద్వారా సమాజంలో మారుతున్న ఆలోచనా విధానం స్పష్టమవుతుందనే...