Huawei AITO M9: ఈ కారు ఏముంది భయ్యా!.. కారులోనే థియేటర్ కూడా!

Huawei AITO M9: చైనా దేశానికి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ హువావే మరో సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఐటో ఎం9 పేరుతో విడుదలైన ఈ వాహనం ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకుంది. ఈ వాహనం రెండు రకాలుగా అందుబాటులో ఉంది. ఒకటి పూర్తిగా విద్యుత్ ఆధారిత వాహనం కాగా, మరొకటి బ్యాటరీకి అదనంగా ఇంజిన్ సహకారం ఉండే విధంగా రూపొందించబడింది. ఈ వాహనంలో హువావే సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన హార్మోనీ వ్యవస్థను ఉపయోగించారు. ఈ సాంకేతికత వాహనంలోని అన్ని పనులను సులభంగా...