War: వణికిస్తున్న మిస్సైళ్లు.. ఇరాన్ కన్నీళ్లు

War: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ, ఇరాన్ దేశం యుద్ధ మేఘాల కింద నలిగిపోతూ భయానక వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. వరుసగా జరుగుతున్న దాడులు, మిసైల్ దాడుల మోతతో అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ఒకప్పుడు సందడిగా కళకళలాడిన నగరాలు ఇప్పుడు సైరన్ల శబ్దాలతో మారుమోగుతున్నాయి. ప్రాణభయం మధ్య ప్రతి క్షణం గడపాల్సిన పరిస్థితి ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితిలో జీవనం సాగించడం అక్కడి ప్రజలకు భయానక అనుభవంగా మారింది. నిరంతర దాడుల ప్రభావంతో ప్రజల మానసిక స్థితి దెబ్బతింటోంది. ప్రతి శబ్దం ఓ పేలుడుగా అనిపించడం, నిద్రలో కూడా భయం...