Bullet Train: భారత తొలి బుల్లెట్ రైలు పట్టాలపై ఎప్పుడు పరుగులు తీస్తుందో తెలుసా?
Bullet Train: భారతదేశ రైల్వే రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న తొలి బుల్లెట్ రైలు త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టనుంది. బి28 పేరుతో రూపొందుతున్న ఈ హైస్పీడ్ రైలు మార్చి 2027 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. బెంగళూరులోని బీఈఎమ్ఎల్ రైలు కోచ్ కాంప్లెక్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి శరవేగంగా పనులు కొనసాగిస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 2024లో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆదేశాలు వెలువడగా, ప్రస్తుతం రెండు రైలు సెట్ల తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందుతున్న ఈ బుల్లెట్ రైలు దేశ...