IPL 2026: రాజస్థాన్ సంచలన విజయం.. గుజరాత్‌పై 6 పరుగుల తేడాతో గెలుపు
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో తుషార్ దేశ్‌పాండే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ ఆశలను చిదిమి, రాజస్థాన్‌కు గెలుపు అందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రవి బిష్ణోయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్యాట్స్‌మెన్లు గుజరాత్...