ఈ మొక్క ఇంటి దగ్గర ఉంటే పాములకు గజగజే..
ఎండాకాలం ఉధృతమవుతున్న కొద్దీ మనుషులే కాకుండా మూగజీవాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా భూమి లోపల ఉండే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాములు చల్లదనం కోసం తమ బొరియలను వదిలి బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో అవి ఆహారం, నివాసం కోసం జనావాసాల వైపు చేరడం సహజ పరిణామంగా మారుతోంది. దీంతో గ్రామాలు, పట్టణాల్లో పాముల సంచారం పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. అయితే కొన్ని సరళమైన జాగ్రత్తలు పాటించడం, సహజ సిద్ధమైన మొక్కలను పెంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాములు శీతల రక్త జీవులు కావడంతో అవి తమ శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకోలేవు. బయట వాతావరణం ఎలా...