Chanakya Niti: చేతిలో డబ్బు నిలవట్లేదా..? ఈ తప్పులు అస్సలు చేయకండి!

Chanakya Niti: ప్రాచీన భారత జ్ఞాన సంపదలో విశిష్ట స్థానం కలిగిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వ్యక్తి జీవితాన్ని సుసంపన్నంగా మార్చే అనేక విలువైన సూచనలు ఇచ్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఎంత సంపాదించినా, కొన్ని చెడు అలవాట్లు అతడిని క్రమంగా పేదరికం వైపు నడిపిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే వ్యక్తిగత జీవన విధానంలో పరిశుభ్రత, నియమం, మంచి ప్రవర్తన తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దైనందిన జీవితంలో చిన్న చిన్న అలవాట్లను మార్చుకోకపోతే సంపద నిలవదని, జీవితం అస్థిరంగా మారుతుందని చాణక్యుడు హెచ్చరించాడు. చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం పరిశుభ్రత లేకపోవడం ఒక పెద్ద లోపంగా పరిగణించబడుతుంది....