Smartphone Offers: బంపరాఫర్.. 17 ప్రో మ్యాక్స్‌పై రూ.49,000 తగ్గింపు!
Smartphone Offers: టెక్ ప్రపంచంలో ప్రముఖ స్థానం సంపాదించిన ఆపిల్ తన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలో భారీ తగ్గింపును ప్రకటించింది. ప్రారంభ ధర రూ.1,49,900గా ఉన్న ఈ ప్రీమియం ఫోన్, ఇప్పుడు రూ.1,02,900కు అందుబాటులోకి రావడం వినియోగదారులకు ఆకర్షణీయమైన అవకాశంగా మారింది. ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఇమాజిన్ స్టోర్ ద్వారా మాత్రమే లభిస్తోంది. అత్యాధునిక కెమెరా వ్యవస్థ, శక్తివంతమైన ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ భారీ ధర తగ్గింపు వెనుక పలు ఆఫర్లు పనిచేస్తున్నాయి....