YCP Protests: జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

YCP Protests: కలియుగ దైవంగా భక్తుల హృదయాల్లో విశిష్ట స్థానం పొందిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో ఉండగా, ఇటీవలి కాలంలో ఆధ్యాత్మికత కంటే రాజకీయ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మార్పుల అనంతరం, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత పాలనలో జరిగిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో నెయ్యి కల్తీ, పరాకమణి దొంగతనాలు, ధార్మిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఈ విషయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో తిరుమల ఆలయం రాజకీయ వేదికగా మారినట్టుగా...