CM Revanth Reddy: ప్రైవేట్ స్కూల్స్ ఖాళీ అవ్వాల్సిందే!
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆధునికీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాన్ని దశలవారీగా చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో రూ.20,000 కోట్ల వ్యయంతో మొదటి దశ పనులు ప్రారంభించగా ప్రస్తుతం 59 పాఠశాలల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల విస్తీర్ణంలో, 500000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడెం రోడ్డులో ఉన్న ఏవీఎన్ లేక్ ఫీల్డ్ గ్లోబల్ పాఠశాలను...