War Effect: సామాన్యుడిపై ధరల పిడుగు
War Effect: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి, అలాగే ఎర్ర సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు ఆలస్యమవుతుండటం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. దిగుమతులపై ఆధారపడే దేశంగా భారతదేశం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోకెమికల్స్ ఆధారిత అన్ని పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్, ప్యాకేజింగ్, గ్లాస్ పరిశ్రమలు ఖర్చులు పెరగడంతో ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధ పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ తరచూ విభిన్న వ్యాఖ్యలు చేస్తుండటం...