Weather Alert: ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విభిన్నంగా మారుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు అనుకోకుండా వర్షాలు కురుస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల వాతావరణ పరిస్థితులపై స్పష్టత ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో...