Warangal: సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు

Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెలుగులోకి వచ్చిన అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. కార్యాలయంలో జరుగుతున్న అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో సబ్ రిజిస్ట్రార్లు కొనసాగిస్తున్న సంబంధాలు ఈ దాడుల్లో బట్టబయలయ్యాయి. సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యక్తులు అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తనిఖీల్లో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది....