LPG Supply: తెలుగు రాష్ట్రాలు గ్యాస్ కష్టాల నుంచి ఇక గట్టెక్కినట్లే!

LPG Supply: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల మధ్య ఉపశమనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో ఎల్‌పీజీ గ్యాస్‌ను మోసుకొచ్చిన ‘పైన్ గ్యాస్’ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అవసరమైన గ్యాస్ నిల్వలు గణనీయంగా పెరిగాయి. సుమారు 47000 టన్నుల ఎల్‌పీజీ గ్యాస్‌ను తీసుకువచ్చిన ఈ భారీ నౌక మొదట ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న డిమాండ్, నిల్వల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నౌకను దమ్రా నుంచి విశాఖపట్నం పోర్టుకు మళ్లించడం ద్వారా ముందస్తు...