Emotional Story: మూగజీవి ఆఖరి నివాళి.. తిండి పెట్టిన వ‌ృద్దురాలి మృతదేహన్ని హత్తుకున్న కోతి

Emotional Story: మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుందనే విమర్శలు వినిపిస్తున్న ఈ కాలంలో, ఒక మూగజీవి చూపిన ప్రేమ అందరినీ కదిలించేలా చేసింది. ప్రేమకు భాష అవసరం లేదని, మనసు ఉన్న చోట ఆప్యాయత సహజంగా వ్యక్తమవుతుందని చెప్పేలా ఈ ఘటన నిలిచింది. కర్ణాటకలోని రాయర దొడ్డి గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ అనేకమందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. ఆ గ్రామానికి చెందిన 85 సంవత్సరాల వయస్సున్న పార్వతమ్మ అనే వృద్ధురాలు గత సోమవారం వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె జీవించి ఉన్న సమయంలో కొన్నేళ్లుగా తన ఇంటి పరిసరాల్లో తిరిగే కోతులకు ప్రతిరోజూ ఆహారం పెట్టడం అలవాటుగా...