Technology: అంధుల కోసం ప్రమాదాలను పసిగట్టే స్మార్ట్‌షూస్ ఆవిష్కరణ!
Technology: దృష్టి లోపం ఉన్నవారు లేదా పూర్తిగా అంధులు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు అనేకం. ఇంటి బయటకు వెళ్లడం నుంచి సాధారణంగా రోడ్డు మీద నడవడం వరకూ ప్రతి అడుగులోనూ ప్రమాదం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఎదురుగా గుంతలున్నా, రాళ్లు ఉన్నా, వాహనాలు వస్తున్నా కనిపించకపోవడంతో అనేకసార్లు ప్రమాదాలకు గురవుతున్నారు. తమ పరిసరాల్లోనే సురక్షితంగా తిరగడానికి కూడా ఇబ్బందులు పడుతున్న ఈ వర్గానికి ఉపశమనం కలిగించేలా ఆస్ట్రియాకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులతో కలిసి ప్రత్యేకంగా అంధులు, దృష్టిలోపం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ షూస్‌ను అభివృద్ధి చేసింది. ఈ కొత్త...