Ponguleti Srinivas Reddy: ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి
Ponguleti Srinivas Reddy: ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వాన్ని అందించడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేశామని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు, భూయజమానులకు పూర్తి భరోసా కల్పించే విధంగా భూభారతి వ్యవస్థను రూపొందించామని పేర్కొన్నారు. భూముల రికార్డుల్లో పారదర్శకత పెంచడమే కాకుండా సమస్యలు లేకుండా లావాదేవీలు జరిగేలా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. భూసర్వే పనులు సులభంగా సాగేందుకు ప్రత్యేకంగా...