Telangana: రేపటి నుంచి మీ సేవలు బంద్!
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అత్యంత కీలక సేవలను అందించే మీసేవ వ్యవస్థలో తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. మెయింటెనెన్స్ పనులు మరియు డేటాబేస్ మైగ్రేషన్ కార్యక్రమాల నేపథ్యంలో వరుసగా 2 రోజుల పాటు మీసేవ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఈనెల 3 తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈనెల 5 తేదీ ఉదయం 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ఈ కాలంలో ఆన్లైన్ ద్వారా పొందే సేవలతో పాటు మీసేవ కేంద్రాల ద్వారా జరిగే అన్ని లావాదేవీలు కూడా పూర్తిగా నిలిచిపోతాయని వివరించారు. ప్రజలు ఈ పరిస్థితిని...