Weather Alert: ఎండలు దంచికొట్టే ఛాన్స్!

Weather Alert: వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలను మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభంతోనే ఎండల ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం...