Cabinet Expansion: 2029లో కేబినెట్ విస్తరణలో లక్కీ ఛాన్స్ ఎవరికో?
Cabinet Expansion: కేంద్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుందనే ప్రచారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణకు సిద్ధత జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలోనే ఈ విస్తరణ చేపడతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి విస్తరణలో కొంతమందికి శాఖల మార్పులు, కొత్తవారికి అవకాశాలు, మరికొంతమందికి పదవుల కోతలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి...