War: గల్ఫ్‌లోని టెక్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్

War: ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతూ రెండో నెలలోకి చేరుకున్నాయి. గత నెలగా సాగుతున్న ఈ పోరులో ఇరాన్ పలు కీలక నేతలను కోల్పోయినప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ పక్షాలు పూర్తిగా ఆధిపత్యం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధ వ్యూహంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాంకేతిక రంగంపై దృష్టి సారించిన ఇరాన్, ఇప్పుడు ప్రముఖ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు సంస్థలు ఇప్పటికే తమ కేంద్రాలను మూసివేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా తమ పౌరులకు అమెరికా ప్రభుత్వం అప్రమత్త సూచనలు జారీ చేసింది. యుద్ధం...