Saleswaram Yatra: ప్రకృతి ఒడిలో పరమశివుడు.. తెలంగాణ అమర్నాథ్ యాత్ర నేటి నుంచే ప్రారంభం!
Saleswaram Yatra: తెలంగాణలో అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సాహస యాత్రలలో ఒకటైన సలేశ్వరం జాతర నేటి నుంచి భక్తుల సందడితో ప్రారంభమైంది. నల్లమల అరణ్యపు లోతుల్లో, ప్రకృతి నడుమ వెలసిన ఈ పవిత్ర క్షేత్రం సలేశ్వరం దేవాలయం ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి సందర్భంగా మాత్రమే దర్శనానికి అనుమతించబడుతుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న లింగమయ్యను దర్శించుకోవడం అనేది సాధారణ యాత్ర కాదని, అది భక్తి, ధైర్యం, సహనాన్ని పరీక్షించే ప్రయాణమని భక్తులు భావిస్తున్నారు. ఏటా కేవలం 3 నుండి 5 రోజుల పాటు మాత్రమే అనుమతి ఉండటంతో, ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున...