Yamaha: అబ్బా.. బైక్ అంటే ఇది.. పెట్రోల్‌తో పాటు కరెంట్తోనూ నడుస్తుంది!
Yamaha: ప్రముఖ టూ వీలర్ సంస్థ Yamaha Motor Company సరికొత్త సాంకేతికతతో మరో వినూత్న అడుగు వేసింది. “ఎంటీ-09 పిహెచ్ఈవీ” కాన్సెప్ట్ పేరుతో పరిచయం చేసిన ఈ సూపర్ బైక్ సాధారణ మోటార్ సైకిళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా రూపుదిద్దుకుంది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ టెక్నాలజీని కలిపి హైబ్రిడ్ విధానంలో ఈ వాహనాన్ని రూపొందించారు. పిహెచ్ఈవీ అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం అని అర్థం, అంటే అవసరమైతే బ్యాటరీని బయట నుంచి కూడా నేరుగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఈ బైక్‌లో ఉంటుంది. భవిష్యత్ ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్ పరిశ్రమలో కొత్త దిశగా భావిస్తున్నారు....