Charishma Reddy: రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు?
Charishma Reddy: తెలంగాణ రాజకీయాల్లో క్రమంగా వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 27 నెలలు గడిచినా.. ఇంకా మరో రెండున్నరేళ్లు అధికార కాలం మిగిలి ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే రాబోయే ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష పార్టీలు మాత్రం ఈసారి కాంగ్రెస్కు అవకాశమే ఇవ్వమని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య పోరు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావడానికి సీనియర్ నేతలు అంతర్గతంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే అవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులకు భవిష్యత్...