Iran Conflict: అధ్యక్షుడి మాటకు విలువేది..?

Iran Conflict: యుద్ధ పరిస్థితుల్లో ఒక దేశానికి ఐక్యతే ప్రధాన బలం అని చరిత్ర చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం ఇరాన్ పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా మారుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి పెరుగుతున్న ముప్పు ఉండగా, మరోవైపు దేశ అంతర్గతంగా అధికార పోరు తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరియు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధానాధికారి అహ్మద్ వాహిది మధ్య నెలకొన్న విభేదాలు దేశ భద్రతను సవాల్‌గా మారుస్తున్నాయి. ఈ పరిణామాలు యుద్ధం కంటే ప్రమాదకరంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రభావం ప్రజల జీవన విధానంపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుండటంతో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కాల్పుల విరమణకు...