April Rules: అమల్లోకి కొత్త రూల్స్!

April Rules: ఏప్రిల్ 1 అనగానే చాలామందికి ఫూల్స్ డే గుర్తుకొస్తుంది. కానీ వాస్తవానికి అదే రోజు దేశవ్యాప్తంగా కొత్త ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుట్టే రోజు కూడా కావడం విశేషం. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నియమాలు సాధారణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకురానున్నాయి. ఈ మార్పుల్లో కొన్ని నేరుగా ప్రజల ఖర్చులపై ప్రభావం చూపగా, మరికొన్ని పరోక్షంగా ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ ధరలు, పన్ను విధానం, బ్యాంకింగ్ నిబంధనలు, ప్రయాణ సదుపాయాలు, ఉద్యోగుల జీతాలు వంటి అనేక అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మొత్తం మీద ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చులపై...