Vijay's Speech: జగన్, పవన్‌పై పంచులు? (VIDEO)

Vijay's Speech: కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్, ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తిగా విజయ్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం, పొత్తులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఊపందుకున్నాయి. https://twitter.com/PapalakeyPapa/status/2038911156677685688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2038911156677685688%7Ctwgr%5Ee7d2f907764cde1f23c68297977be5e63fe32768%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPapalakeyPapa%2Fstatus%2F2038911156677685688...