Telangana: ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!

Telangana: నాన్‌వెజ్ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించే వారికి ఇది పెద్ద షాక్‌గా మారే పరిణామం. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు నిరవధికంగా బంద్ కానున్నట్లు చికెన్ షాపుల యజమానుల సంఘం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని కలుపుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపించనుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇస్తున్న కమీషన్ మార్జిన్‌ను తీవ్రంగా తగ్గించడం వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు లభించిన మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కు కుదించడం వల్ల వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు....