Cicada: మరోసారి కోవిడ్ ముప్పు..?

Cicada: ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు తీవ్ర భయాందోళనలకు గురి చేసిన కరోనా వైరస్ మళ్లీ రూపాంతరం చెంది కొత్త రూపంలో వ్యాప్తి చెందుతున్నట్లు ఆరోగ్య రంగం హెచ్చరిస్తోంది. తాజాగా ‘సికాడా’ అనే పేరుతో పిలవబడుతున్న BA.3.2 అనే ఒమిక్రాన్ ఉపవేరియంట్ బయటపడటం గమనార్హం. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే 23కి పైగా దేశాలకు వ్యాపించినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. గతంలో కనిపించిన వేరియంట్లతో పోలిస్తే ఇది కొంత భిన్న లక్షణాలను ప్రదర్శించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో ఈ కొత్త మార్పు ప్రజల్లో మరోసారి ఆందోళనను కలిగిస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ను తొలిసారిగా...