Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..? కానీ..
Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించడానికి వినియోగించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి రావడం ఆరోగ్య రంగంలో విశేష చర్చకు దారితీసింది. గతంలో అధిక ధరల కారణంగా చాలా మందికి అందని ద్రవ్యంగా ఉన్న ఈ ఔషధం, జెనరిక్ రూపాల్లో మార్కెట్లోకి ప్రవేశించడంతో దాని ధర దాదాపు 90 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ధర తగ్గిందనే కారణంతో ఎవరైనా స్వతహాగా ఈ మందును వినియోగించడం సురక్షితం కాదని వైద్యులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సూచనల మేరకే ఈ ఔషధాన్ని వినియోగించాలనే సూచనలు వెలువడుతున్నాయి. 2026 మార్చి 20న సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగిసిన వెంటనే...