Bottle: ఫ్రిజ్‌లో పెట్టడానికి ప్లాస్టిక్ బాటిల్ బెటరా?.. స్టీల్ బాటిల్ బెటరా?.. గాజు బాటిల్ బెటరా?

Bottle: ఎండాకాలంలో చల్లటి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తాగడం మనందరికీ అలవాటు. అయితే మనం ఆ నీటిని ఏ బాటిల్‌లో ఉంచుతున్నామనేది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. చాలామంది చౌకగా, తేలికగా ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతుంటారు. కానీ సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లలో BPA అనే హార్మోన్లకు హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ బాటిళ్లను ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆ రసాయనాలు నీటిలో కలిసిపోతాయి. దాంతో మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు నష్టం కలుగుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంలో జాగ్రత్త తప్పనిసరి. వీలైతే BPA Free అని లేబుల్ ఉన్న బాటిళ్లను మాత్రమే ఎంచుకోవడం మంచిది. ఆరోగ్య పరంగా, రిఫ్రిజిరేటర్‌లో నీటిని...