Actress Mamatha: ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక..

Actress Mamatha: తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక హాస్య నటనతో ప్రేక్షకులను అలరించిన నటి మమత జీవితం మాత్రం చివరికి విషాదకరంగా మారింది. అసలు పేరు ఝాన్సీ రాణి అయిన ఆమె గుంటూరులో జన్మించి పెరిగారు. చిన్నప్పటి నుంచే నాటకాలు, నృత్యాలపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు రంగస్థల నటుడైన తండ్రి వెంకటేశ్వరరావు ప్రోత్సాహం అందించారు. ఈ ప్రోత్సాహంతోనే నాటకాల్లో ప్రవేశించి తన ప్రతిభను చాటుకున్నారు. మద్రాసులో వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించడం ద్వారా కళారంగంలో మరింత పట్టు సాధించారు. అదే సమయంలో హేమమాలిని, రేఖ వంటి ప్రముఖులతో కలిసి శిక్షణ పొందడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. మొదట రంగస్థల...