Devotional: హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం!
Devotional: హనుమంతుడి ప్రతిరూపంగా భావించే వానరం ఒకటి ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కేంద్రంలోని రామాలయంలో ఈ విశేష సంఘటన చోటుచేసుకుంది. అక్కడ హనుమాన్ విగ్రహానికి స్వాములు నిత్య పూజలు నిర్వహిస్తున్న సమయంలో అనూహ్యంగా ఒక వానరం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించింది. సాధారణంగా అలజడి సృష్టించే వానరం, ఈ సందర్భంలో మాత్రం పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆకట్టుకుంది. పూజలు జరుగుతున్న సమయంలో ఆ వానరం ఎంతో శాంతంగా, క్రమశిక్షణతో అక్కడే నిలబడి ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళ హారతి సమయానికి కూడా అది కదలకుండా నిలబడి, పూజా కార్యక్రమం పూర్తయ్యే వరకు...