LPG: కొత్త PNG కనెక్షన్‌ పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్ ఇవే!

LPG: దేశంలో పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న చోట్ల సంప్రదాయ ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా పైప్‌లైన్ గ్యాస్ వైపు మారాలని ప్రోత్సహిస్తున్నారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, కొన్ని నగరాల్లో పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఎల్పీజీనే ఉపయోగిస్తున్న గృహాలకు గ్యాస్ కంపెనీలు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నోటీసు అందుకున్న తర్వాత సాధారణంగా 90 రోజులలోపు పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్‌కు మారాలని సూచనలు ఇస్తున్నారు. ఈ...