Virat Kohli: ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా విరాట్ సరికొత్త చరిత్ర

Virat Kohli: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్ నుంచే క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ పోరులో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో మళ్లీ మాయ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కీలక సమయంలో బాధ్యత తీసుకుని జట్టును గెలిపించిన ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. అదే సమయంలో ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డులను సృష్టిస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు...