Vishnu Vinyasam: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్.. ఈ సినిమాలో అన్ని యాక్సిడెంట్లే.. కానీ మర్డర్స్!
Vishnu Vinyasam: టాలీవుడ్లో ప్రత్యేకమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీ విష్ణు ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వినోద ప్రధాన కథాంశంతో వచ్చిన ‘విష్ణు విన్యాసం’ తర్వాత పూర్తిగా భిన్నమైన శైలిలో తెరకెక్కిన ‘మృత్యుంజయ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన రొటీన్‌కు భిన్నంగా ఈసారి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంచుకోవడం విశేషం. పేరు చెప్పినట్టుగానే ఉత్కంఠ, మిస్టరీ, అనూహ్య మలుపులతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్, రచ్చ రవి, బాలాదిత్య తదితరులు...