Sea Map: సముద్రగర్భం మ్యాప్.. నీరు లేకపోతే ఇలా ఉంటుందా?

Sea Map: భూమి ఉపరితలంలో సుమారు 70 శాతం భాగం నీటితో కప్పబడి ఉండగా, మిగిలిన 30 శాతం మాత్రమే భూమిగా కనిపిస్తోంది. ఈ భూభాగాలపైనే మనిషి జీవనం కొనసాగుతోంది. అయితే శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం గత కాలంలో భూమి విస్తీర్ణం మరింత ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. కాలక్రమేణా సముద్ర మట్టం పెరుగుతూ రావడంతో తీరప్రాంతాలు క్రమంగా నీటిలో కలిసిపోతున్నాయి. మన దేశంలోని గుజరాత్ తీరంలో ఉన్న ప్రాచీన ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయిన ఉదాహరణ దీనికి సాక్ష్యంగా చెప్పబడుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటక ప్రాంతం కూడా కరిగిపోతుండటంతో సముద్ర మట్టాలు మరింత...