US-Iran War: ట్రంప్ ప్లాన్ B.. ఇదేనా..?

US-Iran War: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయనే సంకేతాలు మొదట కనిపించినా, తాజా పరిణామాలు మాత్రం విరుద్ధ దిశగా వెళ్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటించిన 24 గంటలు కూడా గడవకముందే, టెహ్రాన్ నుంచి వచ్చిన కఠిన స్పందన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమపై జరిగిన దాడులను ఓటమిగా భావించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశించవద్దని ఇరాన్ సైనిక వర్గాలు స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలపై ట్రంప్ చేసిన...