Sperm: చంద్రుడిపై పిల్లలు పుట్టరా?
Sperm: మనిషి కలలకు హద్దులు లేవు. భూమి మీద మాత్రమే కాదు.. చంద్రుడిపై కూడా జీవితం గడపాలని, అక్కడ ఇళ్లు కట్టి కుటుంబాలను స్థాపించాలని చాలా మంది ఊహించుకుంటుంటారు. అయితే ఈ కలలు ఎంత అందంగా కనిపించినా, వాస్తవ పరిస్థితులు మాత్రం అంత సులభంగా లేవని తాజా శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో, అంతరిక్షంలో మానవ ప్రజనన ప్రక్రియ ఎంత క్లిష్టంగా మారుతుందో వెల్లడైంది. మనిషి శరీరం భూమి వాతావరణానికి అనుకూలంగా రూపొందినందున, చంద్రుడు లేదా అంతరిక్ష పరిస్థితుల్లో అదే విధంగా పనిచేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు కొత్త కోణం కనిపించింది. భూమిపై జీవులన్నీ గురుత్వాకర్షణ...