Mulkanur: ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం

అంగరంగ వైభవంగా సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవం స్టార్ త్రినేత్రం, హన్మకొండ: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల ఉత్సవాలు భక్తి, భవ్యతల సమ్మేళనంగా కొనసాగాయి. శుక్రవారం ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా, శనివారం శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ మహోత్సవంలో సమస్త దేవతలను, పవిత్ర నదులను ఆవాహన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, సమస్త వానర...